హైటెక్ జీవన విధానంలో లేట్‌నైట్‌ డిన్నర్‌ అనేది సర్వసాధారణమైపోయింది. దీనివల్ల అజీర్తి సమస్యలు, మలబద్ధకం, నిద్రలేమి, మధుమేహం, ఇతర అనేక రకాల అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే, రాత్రిళ్లు తొందరగా భోజనం చేస్తే చాలా రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.

పైగా, రాత్రి వేళల్లో తొందరగా తినే వారిలో శక్తిస్థాయి పెరిగి.. పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు తింటే లేని రోగాలనుకొని తెచ్చుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.

పగటి వేళ జీవక్రియ వేగంగా జరుగుతుంది. రాత్రివేళ జీవక్రియ రేటు తగ్గుతుంది. వైద్యనిపుణుల సూచన ప్రకారం రాత్రి ఆరు గంటలకే భోజనం చేస్తే ఎంతో మంచిదని సలహా ఇస్తున్నారు. రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేయడం ఎంత మాత్రం మంచిది కాదనీ, లేట్‌ నైట్‌ పనిచేసేవారు, నైట్‌ షిఫ్ట్స్‌లో పనిచేసేవారు సాధ్యమైనంత వరకు 8 లోపే భోజనం చేయాలని చెపుతున్నారు.

అయితే, రాత్రిపూట తినే ఆహారం లైట్‌గా ఉండాలనీ, బిర్యానీలు, పిజ్జా, బర్గర్లు వంటి జంక్‌ఫుడ్‌, నూడుల్స్‌ వంటి ఫాస్ట్‌ఫుడ్‌ రాత్రిపూట తీసుకుంటే అనారోగ్య సమస్యలను అంతా ఫాస్ట్‌గా తెచ్చుకున్నట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. అలాగే భోజనం చేశాక పది నిమిషాల పాటు వాకింగ్ చేస్తే జీవక్రియ వేగం పెరుగుతుందని చెపుతున్నారు.

Category:

Health Tips, Recent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*